AP Inter Supplimentary 2025 in telugu: ఆంధ్రప్రదేశ్ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
AP Inter Supplimentary 2025 in telugu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు ఏప్రిల్ 12, 2025 వ తేదీన విడుదల కావడం జరిగింది. ఈ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో మొదటి సంవత్సరం విద్యార్థులు 70% మరియు రెండవ సంవత్సరం విద్యార్థులు 83% మంది పాసయ్యారు.
ఇంటర్మీడియట్ విద్యార్థినీ, విద్యార్థిలకు సప్లమెంటరీ, బెటర్మెంట్ ఎగ్జామ్ మే 12, 2025 వ తేదీ నుండి మే 20,2025 వ తేది వరకు నిర్వహించడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జాం ను నిర్వహించడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2:30 నిమిషాల నుండి సాయంత్రం 5:30 వరకు ఎగ్జామ్ ఉంటుంది.
Inter 1st year time table:
మే 12, 2025 - సోమవారం - 2nd లాంగ్వేజ్ పేపర్ - 1
మే 13, 2025 - మంగళవారం - ఇంగ్లీషు పేపర్ - 1
మే 14, 2025 - బుధవారం - మ్యాథమెటిక్స్ పేపర్- IA
బోటనీ పేపర్ - 1
సివిక్స్ పేపర్ - 1
మే 15, 2025 - గురువారం - మ్యాథమెటిక్స్ పేపర్- IB
జువాలజీ పేపర్ - 1
హిస్టరీ పేపర్ - 1
మే 16, 2025 - శుక్రవారం - ఫిజిక్స్ పేపర్ - 1
ఎకనామిక్స్ పేపర్ - 1
మే 17, 2025 - శనివారం - కెమిస్ట్రీ పేపర్ - 1
కామర్స్ పేపర్ - 1
సోషియాలజీ పేపర్- 1
ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్-1
మే 19, 2025 - సోమవారం - పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ - 1
లాజిక్ పేపర్ - 1
బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ పేపర్ - 1(బీపీసీ స్టూడెంట్స్ కోసం)
మే 20, 2025 - మంగళవారం - మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ - 1
జాగ్రఫీ పేపర్ - 1
Inter 2nd year time table:
మే 12, 2025 - సోమవారం - 2nd లాంగ్వేజ్ పేపర్ - II
మే 13, 2025 - మంగళవారం - ఇంగ్లీషు పేపర్ - II
మే 14, 2025 - బుధవారం - మ్యాథమెటిక్స్ పేపర్- IIA
బోటనీ పేపర్ - II
సివిక్స్ పేపర్ - II
మే 15, 2025 - గురువారం - మ్యాథమెటిక్స్ పేపర్- IIB
జువాలజీ పేపర్ - II
హిస్టరీ పేపర్ - II
మే 16, 2025 - శుక్రవారం - ఫిజిక్స్ పేపర్ - II
ఎకనామిక్స్ పేపర్ - II
మే 17, 2025 - శనివారం - కెమిస్ట్రీ పేపర్ - II
కామర్స్ పేపర్ - II
సోషియాలజీ పేపర్- II
ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్-II
మే 19, 2025 - సోమవారం - పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ - II
లాజిక్ పేపర్ - II
బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ పేపర్ - II (బీపీసీ స్టూడెంట్స్ కోసం)
మే 20, 2025 - మంగళవారం - మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ - II
జాగ్రఫీ పేపర్ - II
ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ను మే 28, 2025 వ తేదీ బుధవారం నుండి జూన్ 1, 2025 వ తేదీ ఆదివారం వరకు జరగనున్నాయి.
ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామినేషన్ ని జూన్ 4, 2025 వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించడం జరుగుతుంది.
ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్ ను జూన్ 6, 2025 వ తేదీ శుక్రవారం ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించడం జరుగుతుంది.
AP Inter supplimentary:
ఇంటర్లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఈ సప్లమెంటరీ కోసం అప్లై చేసుకోవాలి. ఈ సప్లమెంటరీ కోసం ఏప్రిల్ 15, 2025 నుండి ఏప్రిల్ 22, 2025 లోపు కాలేజీకి వెళ్లి అప్లై చేసుకోండి. ఎగ్జామ్స్ అనేవి మే 12 నుండి మే 20 వరకు జరగడం జరుగుతుంది.
మీకు ఎన్ని సప్లీలు ఉన్నా 600 రూపాయలను చెల్లించి ఈ సప్లమెంటరీకి అప్లై చేసుకోవాలి. ప్రాక్టికల్స్ కు అప్లై చేయాలి అంటే 270 కట్టాలి. బ్రిడ్జ్ కోర్స్ కోసం 165 రూపాయలు చెల్లించాలి. అలాగే బ్రిడ్జి కోర్సు ప్రాక్టికల్స్ కోసం 275 రూపాయలు చెల్లించాలి.
AP Inter Betterment:
ఇంటర్లో మంచి మార్కులు రాని వారు ఈ బెటర్మెంట్ కి అప్లై చేసుకోవచ్చు. మళ్లీ ఎగ్జామ్ రాయాలి అనుకునేవారు ఈ బెటర్మెంట్ కి అప్లై చేసుకోండి. ఈ బెటర్మెంట్ ఆప్షన్ అనేది మార్కులను ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇంటర్మీడియట్ విద్యార్థులకు మంచి ఆప్షన్. ఎగ్జామ్ లో అనారోగ్యం కారణం వల్లనో లేదా ఇతర కారణాల వల్ల ఎగ్జామ్ బాగా రాయలేక మంచి మార్కులు రాని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. బెటర్మెంట్ కి అప్లై చేసుకొని మంచిగా ఈసారి ఎగ్జామ్స్ రాసి మీరు కోరుకున్న మార్కులను పొందండి.
బెటర్మెంట్ కోసం విద్యార్థులు 600 రూపాయలను ముందుగా చెల్లించాలి. ఒక్కో సబ్జెక్టుకు 150 చొప్పున మీరు ఎన్ని సబ్జెక్ట్స్ కు అప్లై చేసుకోవాలి అనుకుంటే అన్ని 150లు ఎక్స్ట్రాగా పే చేయాలి.
AP Inter Recounting:
మీరు రీ కౌంటింగ్ కి అప్లై చేస్తే, వారు మీ పేపర్లో మరోసారి మార్కులను కౌంట్ చేసి మీకు తెలపడం జరుగుతుంది. ఏవైనా మిస్టేక్స్ పడి మీరు ఫెయిల్ అయి ఉంటే ఈ రీకౌంటింగ్ ద్వారా పాస్ అయ్యే అవకాశం ఉంది.
రీకౌంటింగ్ కోసం 260 రూపాయలను సబ్జెక్టుకు చెల్లించి అప్లై చేసుకోవాలి.
AP Inter Revaluation:
మీరు ఎగ్జామ్ బాగా రాసి ఉన్నారు కానీ మీకు మంచి మార్కులు రాలేదు. మీరు కచ్చితంగా మీరు రాసిన పేపర్లో మంచి మార్కులు వస్తాయి అనే నమ్మకం ఉంది. అటువంటప్పుడు మీరు ఈ రి వాల్యుయేషన్ కి పెట్టుకోండి. రీవాల్యుయేషన్ కి అప్లై చేసుకుంటే.. వారు మళ్లీ మీ పేపర్ ని వాల్యుయేషన్ చేసి మీకు తెలపడం జరుగుతుంది.
ఈ రి వెరిఫికేషన్ మరియు రీవాల్యుయేషన్ కి ఏప్రిల్ 13, 2025వ తేదీ నుండి ఏప్రిల్ 22, 2025 వ తేదీలోపు అప్లై చేసుకోండి.
రీ వెరిఫికేషన్ కోసం 1300 రూపాయలను సబ్జెక్టుకి చెల్లించి అప్లై చేసుకోవాలి.
రీకౌంటింగ్ మరియు రీవాల్యుయేషన్ కి మధ్య తేడా ఏమిటంటే..
రీకౌంటింగ్ అంటే ఓన్లీ మీకు వచ్చిన మార్కులను మళ్లీ కౌంట్ చేసి మీకు తెలపడం జరుగుతుంది.
రీవాల్యుయేషన్ అంటే మీ పేపర్ ను మళ్లీ వాల్యుయేషన్ చేయడం జరుగుతుంది. మీ పేపర్ వాల్యుయేషన్ చేసి మార్కులను తెలుపడం జరుగుతుంది.
0 కామెంట్‌లు