About Me

header ads

Airports Authority of India Junior exicutive recruitment 2025 in telugu: ఎయిర్పోర్టుల్లో ఉద్యోగాలు

 Airports Authority of India Junior exicutive recruitment 2025 in telugu: ఎయిర్పోర్టుల్లో ఉద్యోగాలు


  
Airports Authority of India Junior exicutive recruitment 2025 in telugu: ఎయిర్పోర్టుల్లో ఉద్యోగాలు


  Airports Authority of India(AAI) నుండి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ( ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలు పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఎయిర్పోర్టుల్లో పనిచేయడానికి 309 జూనియర్ ఎగ్జిక్యూటివ్  ( ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ 309 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల లో జనరల్(అన్ రిజర్వ్డ్) క్యాండిడేట్స్ కి 125, ఈ డబ్ల్యూ ఎస్(ఎకనామికల్లి వీకర్ సెక్షన్స్) క్యాండిడేట్స్ కి 30, ఓబిసి( అధర్ బ్యాక్వర్డ్ క్లాసెస్) క్యాండిడేట్స్ కి 72, ఎస్సీ(షెడ్యూల్డ్ కాస్ట్) కాండిడేట్స్ కి 55, ఎస్టీ(షెడ్యూల్డ్ ట్రైబ్స్) క్యాండిడేట్స్ కి 27 పోస్టులను మొత్తంగా 309 ఉద్యోగాలు ఈ రిక్రూట్మెంట్ ద్వారా విడుదల అయ్యాయి.

  ఈ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల కోసం ఏప్రిల్ 25, 2025వ తేదీ నుండి మే 24, 2025 వ తేదీ లోపు ఆన్లైన్ లో www.aai.aero వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో త్వరలో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వెబ్సైట్ www.aai.aero లో  తెలియజేయడం జరుగుతుంది.

Educational Qualification For AAI Posts 2025 in telugu: 


  3 సంవత్సరముల బ్యాచిలర్స్ డిగ్రీని ఫిజిక్స్ మరియు మ్యాథ్స్(BSC (MPCS)) లో  కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఈ ఎయిర్పోర్ట్ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు.

  లేదా 

  ఎనీ డిసిప్లెయిన్ లో ఇంజినీరింగ్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. ( అయితే అభ్యర్థులు ఇంజనీరింగ్ లో ఏదో ఒక సెమిస్టర్ లో మాథ్స్ మరియు ఫిజిక్స్ చదివి ఉండాలి.)

  అలాగే 10+2 లెవెల్ లో ఇంగ్లీష్ రాయడం మరియు మాట్లాడడం వచ్చి ఉండాలి.  

  10th లేదా 12th స్టాండర్డ్ లో ఏదైనా ఒక సబ్జెక్టు కింద ఇంగ్లీష్ ఉండాలి. 

  Age Limit: 


  మే 24, 2025 వ తేదీ నాటికి 18 నుండి 27 సంవత్సరంల మధ్య వయసు కలిగిన అభ్యర్థులందరూ ఈ ఎయిర్పోర్టు ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. 

  ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది. 
  ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిల్యాక్సేషన్ ఉంది.
  ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు 10 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.

Selection Process: 


  ముందుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ను నిర్వహించడం జరుగుతుంది. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్టులో ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ ఉండదు. ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ మరియు హిందీ మీడియంలో ఉంటుంది. 

  కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో పాసైన అభ్యర్థులు అప్లికేషన్ వెరిఫికేషన్/ వాయిస్ టెస్ట్/ సైకోయాక్టివ్ సబ్ స్టాన్సిస్ టెస్ట్/ సైకలాజికల్ అసెస్మెంట్/ ఫిజికల్ మెడికల్ ఎగ్జామినేషన్/ బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ కు అర్హత సాధిస్తారు.

Application Process: 


  * ఇండియన్ సిటిజన్స్ అందరూ రిక్రూట్మెంట్ కి అప్లై చేసుకోవచ్చు. 
  * అభ్యర్థులు వ్యాలీడ్ ఈమెయిల్ ఐడి ని ఇవ్వండి. ఎగ్జామ్ కి అడ్మిట్ కార్డు మరియు అన్ని రకాలుగా ఇమెయిల్ ఉపయోగపడుతుంది. 
  * ఇన్ కంప్లీట్ గా అప్లికేషన్ చేస్తే రిజెక్ట్ అవుతాయి.
  * పాస్పోర్ట్ సైజు కలర్ ఫోటో అనేది 3 నెలల లోపల దిగినది అయి ఉండాలి. ఫోటో అనేది వైట్ బ్యాక్ గ్రౌండ్ లో ఉండాలి. క్యాపు మరియు డార్క్ గ్లాస్సెస్ పెట్టుకొని దిగకూడదు. ఇమేజ్ అనేది జేపీజీ మరియు జేపీఈజీ ఫార్మాట్లో ఉండాలి. 
  * వైట్ పేపర్లో బ్లాక్ పెన్నుతో సైన్ చేయాలి. మీరు సైన్ చేసిన ఆ ప్లేస్ ని స్కాన్ చేసుకొని జేపీజీ మరియు జేపీఈజీ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి.

Application Fee: 

    ఈ రిక్రూట్మెంట్ కి అప్లై చేసుకోవాలి అనుకుంటే ₹1000 అప్లికేషన్ ఫీజు కింద చెల్లించి అప్లై చేసుకోవాలి. 

  మహిళలు, ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.

Salary: సంవత్సరానికి 13 లక్షల రూపాయల జీతం వస్తుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు