CSIR - NCL, junior secretary Assistant job Recruitment 2025 in telugu: ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు.
Council of Scientific and Industrial Research (CSIR) - National Chemical Laboratory (NCL), Pune నుండి జూనియర్ సెక్రెటరీయాట్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ సంస్థ మినిస్ట్రీ ఆఫ్ సైన్సు & టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పని చేస్తుంది. ఇండియన్ సిటిజన్స్ అందరు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలు గ్రూప్ - సి (నాన్ గజిటెడ్) ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయినట్లయితే ప్రతినెల 19900-63200 రూపాయలు + other allowances మధ్య జీతం ఉంటుంది.
ఈ National Chemical Laboratory (NCL) నోటిఫికేషన్ ద్వారా జూనియర్ సెక్రెటరీయాట్ అసిస్టెంట్(జనరల్) - 11 పోస్టులు (అన్ రిజర్వ్డ్-5, ఓబిసి (నాన్ క్రిమిలెయర్)-02, ఎస్సీ - 05, ఎస్టీ - 01, ఈడబ్ల్యూఎస్-01), జూనియర్ సెక్రెటరీయాట్ అసిస్టెంట్ (స్టోర్స్ & పర్చేస్) - 04 (అన్ రిజర్వ్డ్-02, ఎస్టి-01, ఈడబ్ల్యూఎస్-01) , జూనియర్ సెక్రెటరీయాట్ అసిస్టెంట్ (ఫైనాన్స్ & అకౌంట్స్) - 03(అన్ రిజర్వ్డ్-02, ఎస్సీ - 01) పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తంగా 18 పోస్టులను ఈ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ 18 పోస్టులలో ఒక పోస్టు ఎక్స్ సర్వీస్ మెన్ కి రిజర్వ్ చేయబడింది. మెన్ మరియు విమెన్ అభ్యర్థులందరూ ఈ రిక్రూట్మెంట్ కి అప్లై చేసుకోవచ్చు.
ఈ NCL రిక్రూట్మెంట్ కోసం ఏప్రిల్ 07, 2025 వ తేదీ నుండి మే 05, 2025 వ తేదీ లోపు అప్లై చేస్కోవాలి.
Age Limit & Relaxation:
మే 5, 2025 వ తేదీకి 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు రిక్రూట్మెంట్ కి అప్లై చేసుకోవచ్చు.
ఎస్సీ మరియు ఎస్టీకి 5 సంవత్సరాల వయో పరిమితి ఉంది.
ఓబీసీ (నాన్ క్రీమీలేయర్) అభ్యర్థులకి 3 సంవత్సరాల వయోపరిమితి ఉంది.
అన్ రిజర్వ్డ్ (ఫిజికల్ హ్యాండీక్యాప్డ్) అభ్యర్థులకు 10 సంవత్సరాల రిలాక్సేషన్ ఉంది.
ఓ బి సి (ఫిజికల్ హ్యాండీక్యాప్డ్) అభ్యర్థులకు 13 సంవత్సరాల రిలాక్సేషన్ ఉంది.
ఎస్సీ మరియు ఎస్టీ (ఫిజికల్ హ్యాండీక్యాప్డ్) అభ్యర్థులకు 15 సంవత్సరాల రిలాక్సేషన్ ఉంది.
విడోస్/డైవర్స్ డ్ విమెన్/సపరేటేడ్ (అండ్ రిజర్వుడు/ఓబిసి) అభ్యర్తులు 35 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు.
విడోస్/డైవర్స్ డ్ విమెన్/సపరేటేడ్ (ఎస్టీ/ఎస్టీ) అభ్యర్తులు 40 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు.
Educational Qualification:
10+2/ 12th క్వాలిఫికేషన్ కలిగిన క్యాండిడేట్స్ అందరూ ఈ జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు.
అయితే సెలక్షన్ ప్రాసెస్లో టైపింగ్ టెస్టును నిర్వహించడం జరుగుతుంది.
Application Fee:
రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలి అంటే అన్ రిజర్వుడు, ఓబిసి, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 500 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.
మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్, ఎక్సెస్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
ఫీజు అనేది ఆన్లైన్ ద్వారా యూపీఐ, నెట్ బ్యాంకింగ్ లేదా క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా ఫీజు కట్టండి. ఒకసారి ఫీజు కడితే మళ్లీ రీఫండ్ కాదు.
Selection Process:
అప్లై చేసుకున్న వారికి షార్ట్ లిస్ట్ చేసి అడ్మిట్ కార్డులు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రిటర్న్ ఎగ్జామ్ మరియు టైపింగ్ టెస్ట్ ద్వారా పోస్టులను భర్తీ చేస్తున్నారు.
రిటర్న్ ఎగ్జామ్ అనేది ఓఎంఆర్ బేస్డ్ లేదా కంప్యూటర్ బేస్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఎగ్జామ్ ఉంటుంది. క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ మరియు హిందీ మీడియంలో రావడం జరుగుతుంది. 12th స్టాండర్డ్ లో ఎగ్జామ్ డిఫికల్టీ ఉంటుంది. టోటల్గా 200 కొషన్లకు గాను 2 గంటల 30 నిమిషాల పాటు ఎగ్జామ్ ను నిర్వహించడం జరుగుతుంది.
Paper - 1:
మెంటల్ ఎబిలిటీ టెస్ట్- 100 ప్రశ్నలకు గాను 200 మార్కులు చొప్పున 90 నిమిషాల పాటు ఈ పేపర్-1 ఎగ్జామ్ ఉంటుంది. ఈ పేపర్-1 ఎగ్జామ్ లో ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేదు.
Paper -2:
జనరల్ అవేర్నెస్- 50 ప్రశ్నలు- 150 మార్కులు
ఇంగ్లీష్ లాంగ్వేజ్- 50 ప్రశ్నలు- 150 మార్కులు
ఈ పేపర్ 2 ఎగ్జామ్ అనేది 100 ప్రశ్నలకు గాను ఎక్కువ ప్రశ్నకు మూడు మార్కులు చొప్పున 300 మార్కులకు 60 నిమిషాల పాటు ఎగ్జామ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1 నెగిటివ్ మార్కింగ్ ఉంది.
ఈ ఎగ్జామ్ తర్వాత కంప్యూటర్ టైపింగ్ ప్రొఫిసియన్సీ టెస్ట్ ఉంటుంది.
35 వర్డ్స్ ఫర్ మినిట్ ఇంగ్లీష్ టైపింగ్ టెస్ట్ ఉంటుంది లేదా 30 వర్డ్స్ ఫర్ మినిట్ హిందీ టైపింగ్ టెస్ట్ ఉంటుంది.
కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ మాత్రమే.
పేపర్ -1 కూడా క్వాలిఫైయింగ్ మాత్రమే. మెరిట్ లిస్ట్ అనేది ఓన్లీ పేపర్ 2 నుండి మాత్రమే తీయడం జరుగుతుంది.
అపాయింట్మెంట్ ఇచ్చే ముందు చివరిగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
ఈ జాబ్ కి సెలెక్ట్ అయినట్లయితే అన్ని ఉద్యోగాల లాగే ఈ ఉద్యోగానికి కూడా డియర్ నెస్ అలవెన్స్ (DA), హౌస్ రెంట్ అలవెన్స్ (HRA), ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ (TA), ఎక్సెట్రా.. బెనిఫిట్స్ ఉంటాయి.
How to apply:
* ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ రిక్రూట్మెంట్ కోసం https://recruit.ncl.res.in వెబ్ సైటు లో ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.
* మీరు అప్లై చేసుకున్నెప్పుడు వాలిడ్ ఈమెయిల్ ఐడి & ఫోన్ నంబర్ ఇవ్వండి. మి దగ్గర వాలిఢ్ ఈమెయిల్ ఐడి లేకుంటే క్రియేట్ చేస్కోండి. వాలిడ్ ఈమెయిల్ ఐడి & ఫోన్ నెంబర్ మాత్రమే యూజ్ చేయండి.
* మీరు మే 05, 2025 వ తేదీ సాయంత్రం 5:30 లోపు https://recruit.ncl.res.in వెబ్సైట్ లో అప్లై చేస్కోండి.
* రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫోటో ను వాడండి. ఫోటో సైజ్ 100 కేబి లోపు ఉండాలి.
* సిగ్నేచర్ 50 కేబి లోపు ఉండాలి.
* రెలవెంటెడ్ సర్టిఫికెట్స్ అనేవి 3 ఎంబి లోపల ఉండాలి. మీరు స్కాన్ చేసేప్పుడు బ్లర్ లేకుండా చూస్కోండి.
0 కామెంట్‌లు