About Me

header ads

NEIGRIHMS Recruitment 2025: టెన్త్ ఇంటర్ డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.

 NEIGRIHMS Recruitment 2025: టెన్త్ ఇంటర్ డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.

NEIGRIHMS Recruitment 2025: టెన్త్ ఇంటర్ డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.


  NORTH EASTERN INDIRA GANDHI REGIONAL INSTITUTE OF HEALTH & MEDICAL SCIENCES (NEIGRIHMS), MAWDIANGDIANG, SHILLONG నుండి గ్రూప్ సి మరియు గ్రూప్ బి ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఇండియన్ సిటిజన్స్ అందరూ రిక్రూట్మెంట్ కి అప్లై చేసుకోవచ్చు. అన్నీ రాష్ట్రాల అభ్యర్థులు రిక్రూట్మెంట్ కి అప్లై చేసుకోవచ్చు.


  ఈ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్ - 105(అన్ రిజర్వ్డ్-30, ఓబిసి-47, ఎస్సీ-17, ఎస్టి-2, ఈ డబ్ల్యూ ఎస్-9, ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులు అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి), లెవెల్-7 ఉద్యోగం, స్టోర్ కీపర్ - 3(అన్ రిజర్వ్డ్-2, ఓబీసీ-1(ఏదైనా ఒక పోస్టు, ఫిజకల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు )) లెవెల్-6 ఉద్యోగం, రేడియోగ్రాఫర్ - 3(అన్ రిజర్వుడ్-2, ఎస్సీ-1(ఎనీ వన్ పోస్టు పిడబ్ల్యుబిడి కి)) లెవెల్-6 ఉద్యోగం, మెడికల్ సోషల్ వర్కర్ - 1(ఎస్సీ) level-6 ఉద్యోగం, టెక్నీషియన్ ఎండోస్కోపీ/కొలోనోస్కోపీ - 2 (అన్ రిజర్వ్డ్) లెవెల్-6 ఉద్యోగం, టెక్నీషియన్ (న్యూక్లియర్ మెడిసిన్) - 4(అన్ రిజర్వుడ్-3, ఓబిసి-1) లెవెల్-6 ఉద్యోగం, హెల్త్ ఇన్స్పెక్టర్ - 1(అన్ రిజర్వుడ్(పిడబ్ల్యుబిడి)) లెవెల్-6 ఉద్యోగం, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ - 1(అన్ రిజర్వ్డ్) లెవెల్-6 ఉద్యోగం, జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) - 1(ఓబిసి) లెవెల్-6 ఉద్యోగం, ఫార్మసిస్ట్ - 1(ఎస్టి) లెవెల్-5 ఉద్యోగం, టెక్నికల్ అసిస్టెంట్ - 1 (ఎస్టి) లెవెల్-5 ఉద్యోగం, ఈసీజీ టెక్నీషియన్ - 1 (ఎస్టి) లెవెల్-5 ఉద్యోగం, సానిటరీ ఇన్స్పెక్టర్ - 2 (అన్ రిజర్వుడ్-1, ఎస్టీ-1) లెవెల్-5 ఉద్యోగం, సెక్యూరిటీ గార్డ్ - 1 (అన్ రిజర్వుడ్) లెవెల్-2 ఉద్యోగం, రికార్డు క్లర్క్ - 1 (ఈడబ్ల్యూఎస్) లెవెల్-2 ఉద్యోగం, డ్రైవర్ గ్రేడ్ 3 - 1 (ఈడబ్ల్యూఎస్) లెవెల్-2 ఉద్యోగం, డార్క్ రూమ్ అసిస్టెంట్ - 1(ఈడబ్ల్యూఎస్ (పిడబ్ల్యుబిడి)) లెవెన్-2 పోస్టులను రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు. 


  ఈ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు మార్చి 22 2025 వ తేదీ నుండి ఏప్రిల్ 20, 2025 వ తేదీలోపు http://www.neigrihms.gov.in లేదా https://hllneigrihms.cbtexam.in వెబ్ సైట్ ల ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. మహిళలు మరియు పురుషులు అందరూ రిక్రూట్మెంట్ కి ఎలిజిబుల్. 



Age Limit: 


డార్క్ రూమ్ అసిస్టెంట్- 18-30
డ్రైవర్ గ్రేడ్ 3 - 18-30
రికార్డు క్లర్క్ - 18-30
సెక్యూరిటీ గార్డ్ - 18-30
సానిటరీ ఇన్స్పెక్టర్ - 18-30
ఈసీజీ టెక్నీషియన్ - 18-30
టెక్నికల్ అసిస్టెంట్ - 18-30
ఫార్మసిస్ట్ - 18-27
జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) - 18-30
జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ - 18-30
హెల్త్ ఇన్స్పెక్టర్ - 18-30
టెక్నీషియన్ (న్యూక్లియర్ మెడిసిన్) - 18-30
టెక్నీషియన్ ఎండోస్కోపీ/కొలోనోస్కోపీ - 18-30
మెడికల్ సోషల్ వర్కర్ - 18-35
రేడియోగ్రాఫర్ - 18-30
స్టోర్ కీపర్ - 18-30
నర్సింగ్ ఆఫీసర్ - 18-30


ఎస్సీ ఎస్టీకి 5 సంవత్సరములు, ఓబీసీకి 3 సంవత్సరములు, ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు 10 సంవత్సరంల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
  పైన తెలిపిన ఏజ్ లిమిట్ ఉన్నవారు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. 

Educational Qualification: 



డార్క్ రూమ్ అసిస్టెంట్- 10th క్లాస్ చదివి, ఒక సంవత్సరం రేడియోగ్రఫీలో డిప్లమా చేసి ఉండాలి.
డ్రైవర్ గ్రేడ్ 3 - హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. మోటార్ మెకానిజంలో నాలెడ్జ్ ఉండాలి. మినిమం 3 సంవత్సరాల మోటార్ వెహికల్స్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి.
రికార్డు క్లర్క్ - 12th స్టాండర్డ్. సెలక్షన్ ప్రాసెస్లో టైపింగ్ టెస్ట్ ఉంటుంది.
సెక్యూరిటీ గార్డ్ - 10th క్వాలిఫికేషన్ ఉండాలి.
సానిటరీ ఇన్స్పెక్టర్ - పదవ తరగతి క్వాలిఫికేషన్ ఉండాలి మరియు సానిటరీ ఇన్స్పెక్టర్ చేసిన సర్టిఫికెట్ ఉండాలి.
ఈసీజీ టెక్నీషియన్ - ఫిజిక్స్ ను ఒక సబ్జెక్టుగా చదివిన బిఎస్సీ అభ్యర్థులు అర్హులు. అలాగే కార్డియాలజీ ఎక్విప్మెంట్ మీద వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి.
 లేదా
 మూడు సంవత్సరాల ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రికల్ డిప్లమా ని చేసి, కార్డియాలజీ ఎక్విప్మెంట్ మీద వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు.
టెక్నికల్ అసిస్టెంట్ - బీఎస్సీ ని రేడియాలజీ టెక్నిక్స్ మీద చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే రేడియాలజీ టెక్నిక్స్ మీద 2 సంవత్సరాల వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి.
లేదా 
12th లో సైన్స్ చదివి, రేడియాలజీ టెక్నిక్స్ మీద 2 సంవత్సరాల డిప్లమా చేసి, 2 సంవత్సరాలు రేడియాలజీ టెక్నిక్స్ మీద ఎక్స్పీరియన్స్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు.
ఫార్మసిస్ట్ - D.pharm లేదా B.pharm లేదా pharm.D చేసినవారు ఈ పోస్టుకి అప్లై చేసుకోవచ్చు.
జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) - బ్యాచిలర్ డిగ్రీని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. 
లేదా 
3 సంవత్సరముల ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ డిప్లమా చేసిన వారు అప్లై చేసుకోవచ్చు.
జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ - ఎనీ డిగ్రీ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. క్యాష్, అకౌంట్స్ మరియు బడ్జెట్ వర్క్ ను గవర్నమెంట్ ఆఫీసుల్లో/పి ఎస్ యు/అటానమస్ బాడీ/స్టాట్యూటరీ బాడీ లో 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి.
హెల్త్ ఇన్స్పెక్టర్ - BA/BSC కంప్లీట్ చేసి 1.5 సంవత్సరాలు మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ ను నర్సింగ్ కౌన్సిల్ నుండి ట్రైనింగ్ కోర్సు చేసి ఉండాలి. 2 సంవత్సరాల మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ గా ఎక్స్పీరియన్స్ ఉండాలి.
టెక్నీషియన్ (న్యూక్లియర్ మెడిసిన్) - ఎనీ డిసిప్లాన్ లో బిఎస్సి చేసి ఉండాలి. న్యూక్లియర్ మెడిసిన్లో ఎంఎస్సి చేసి ఉండాలి. రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ సర్టిఫికెట్ ఉండాలి. 
లేదా 
ఎనీ డిసిప్లాన్ లో బిఎస్సి చేసి ఉండాలి. మెడికల్ రేడియేషన్ డిప్లమా మరియు ఐసోటోపు టెక్నిక్స్ కోర్సు చేసి ఉండాలి. రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ సర్టిఫికెట్ ఉండాలి. 
టెక్నీషియన్ ఎండోస్కోపీ/కొలోనోస్కోపీ - సైన్సులో 10+2 చేసి ఉండాలి. బీఎస్సీ/డిప్లమా లో ఎండోస్కోపీ టెక్నాలజీ చేసిన వారు అర్హులు. హాస్పిటల్ (ఎండోస్కోపీ/ కొలనోస్కోపీ) లో మూడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి.
మెడికల్ సోషల్ వర్కర్ - సోషల్ వర్కర్/అప్లైడ్ సోషియాలజీ లో మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి. హెల్త్ రిలేటెడ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో 1 సంవత్సరం సోషల్ వర్కర్ గా ఎక్స్పీరియన్స్ ఉండాలి.
రేడియోగ్రాఫర్ - బిఎస్సీ(Hons) ను రేడియాలజీలో చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. 
లేదా 
బిఎస్సీ మెడికల్ టెక్నాలజీ (ఎక్స్ రే) లో చేసిన వారు అప్లై చేసుకోవచ్చు.
స్టోర్ కీపర్ - బ్యాచిలర్స్ డిగ్రీని చేసి ఉండాలి. మెటీరియల్స్ మేనేజ్మెంట్/వియర్ హౌసింగ్ మేనేజ్మెంట్/పర్చేసింగ్/లాజిస్టిక్స్/పబ్లిక్ ప్రాక్యుమెంట్ లో డిప్లమా/డిగ్రీ చేసిన వారు అప్లై చేసుకోవాలి. 
నర్సింగ్ ఆఫీసర్ - బిఎస్సీ నర్సింగ్ చేసిన వారు రిక్రూట్మెంట్ అప్లై చేసుకోవచ్చు.
లేదా 
బిఎస్సి (పోస్ట్ సర్టిఫికెట్) లేదా బిఎస్సి నర్సింగ్ కి ఈక్వాలెంట్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. 
లేదా 
జనరల్ నర్సింగ్ లో డిప్లమా చేసి, 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నవారు రిక్రూట్మెంట్ కి అప్లై చేసుకోవచ్చు. మిగిలిన వివరాలను అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.

Application fee: 


  General/OBC అభ్యర్థులు ఈ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలి అంటే 500 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి. 

  ఎస్సీ/ ఎస్టీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఈ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలి అంటే 250 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి. 

  ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.

  ఎక్కువ సంఖ్యలో అప్లికేషన్స్ వస్తే. వారిని షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అయిన కాండిడేట్స్ కు మాత్రమే అడ్మిట్ కార్డును ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 

  ఏజ్ లిమిట్ మరియు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కట్ ఆఫ్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 20, 2025. 

మీరు అప్లై చేసుకునే ముందు ఆఫీషియల్ నోటిఫికేషన్ను బాగా చదువుకొని అప్లై చేసుకోండి.




కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు