NSD Lower Division Clerk: 10+2/ ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు.
నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, న్యూఢిల్లీ నుండి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా అనేది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పని చేస్తుంది. ఇండియన్ సిటిజన్స్ అందరూ నోటిఫికేషన్ కి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్టర్, అసిస్టెంట్ లైట్ అండ్ సౌండ్ టెక్నీషియన్, అసిస్టెంట్ వార్డ్రోబ్ సూపర్వైజర్, లోవర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలు లెవెల్-2, లెవెల్-6, లెవెల్-7, లెవెల్-8 ఉద్యోగాలు.
ఈ రిక్రూట్మెంట్ కోసం అభ్యర్థులు NSD(NATIONAL SCHOOL OF DRAMA) యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి https://recruitment.nsd.gov.in వెబ్సైటు ద్వారా ఆన్లైన్లో ఏప్రిల్ 28, 2025వ తేదీలోపు అప్లై చేసుకోవాలి. ఇతర వివరాల కోసం www.nsd.gov.in వెబ్ సైట్ ను సందర్శించండి.
ఈ రిక్రూట్మెంట్ ద్వారా Accounts Officer - 1(డిప్యూటేషన్) (లెవెల్ - 8) పోస్టులను, Assistant Registrar - 2( అన్ రిజర్వుడు(డిప్యూటేషన్) - 1, ఎస్సీ (రెగ్యులర్)-1) (లెవెల్ - 7) పోస్టులను, Assistant Light and Sound Technician - 1(అన్ రిజర్వ్డ్) (లెవెల్ - 6) పోస్టులను, Assistant Wardrobe Supervisor- 1(అన్ రిజర్వ్డ్) (లెవెల్ - 6) పోస్టులను, Lower Division Clerk - 6 ( అన్ రిజర్వ్డ్ - 3, ఓబిసి - 1, ఎస్సీ -1, ఈడబ్ల్యూఎస్ - 1) (లెవెల్ - 2) పోస్టులను భర్తీ చేస్తున్నారు.
Age Limit:
Accounts Officer:
56 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న అభ్యర్థులందరూ ఈ పోస్టు కి అప్లై చేసుకోవచ్చు.
Assistant Registrar:
రెగ్యులర్ పోస్టుకి అప్లై చేసుకునేవారు 35 సంవత్సరాల లోపు వయసు ఉండాలి.
డిప్యూటేషన్ పోస్ట్ కి అప్లై చేసుకునే వారు 56 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి.
Assistant Light and Sound Technician:
30 సంవత్సరాల లోపు వయసు ఉన్నవారు ఈ పోస్టు కి అప్లై చేసుకోవచ్చు.
Assistant Wardrobe Supervisor:
30 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉన్నవారు ఈ పోస్టుకి అప్లై చేసుకోవచ్చు.
Lower Division Clerk:
18 నుండి 28 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు ఆ లోవర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకి అర్హులు.
Educational Qualification:
Lower Division Clerk:
10+2 క్వాలిఫికేషన్ కలిగి ఉన్న క్యాండిడేట్స్ అందరూ ఈ రిక్రూట్మెంట్ కి అప్లై చేసుకోవచ్చు. అలాగే సెలక్షన్ ప్రాసెస్లో టైపింగ్ టెస్టును నిర్వహించడం జరుగుతుంది.
Accounts Officer:
అడ్వాన్స్ అకౌంటెన్సీ ఆడిటింగ్ బీకం చేసిన అభ్యర్థులు ఈ పోస్టుకి అర్హులు. అలాగే 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగారు. ఈ ఎక్స్పీరియన్స్ కి సంబంధించి నోటిఫికేషన్ లో మీరే చూసుకోండి.
అలాగే కంప్యూటర్ అప్లికేషన్స్ పై నాలెడ్జ్ కలిగి ఉండాలి.
Assistant Registrar:
ఏదైనా యూనివర్సిటీ నుండి బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులందరూ ఈ రిక్రూట్మెంట్ కి ఎలిజిబుల్. అలాగే 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగారు. ఈ ఎక్స్పీరియన్స్ కి సంబంధించి నోటిఫికేషన్ లో మీరే చూసుకోండి.
అలాగే కంప్యూటర్ అప్లికేషన్స్ పై నాలెడ్జ్ కలిగి ఉండాలి.
Assistant Light and Sound Technician:
10+2 క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి
ఎలక్ట్రికల్ లో డిప్లమా లేదా సౌండ్ టెక్నాలజీలో డిగ్రీ/డిప్లమా కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఈ పోస్టు కి అప్లై చేసుకోవచ్చు.
లైటింగ్/ సౌండ్ ఆపరేషన్స్ పై 5 సంవత్సరముల ఎక్స్పీరియన్స్ ఉండాలి. (ఎక్స్పీరియన్స్ కు సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి)
Assistant Wardrobe Supervisor:
10+2 క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి
కట్టింగ్/ టైలరింగ్ లో డిప్లమా కంప్లీట్ చేసి ఉండాలి.
అలాగే రెండు సంవత్సరముల ఎక్స్పీరియన్స్ ఉండాలి. (ఎక్స్పీరియన్స్ కు సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి)
Application Fee:
ఈ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలి అంటే అన్ రిజర్వ్డ్ అభ్యర్థులు 500 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.
ఓబీసీ(నాన్ క్రీమీ లేయర్) అభ్యర్థులు 250 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లిస్తే సరిపోతుంది.
మహిళలు, ఎస్సీ, ఎస్టి, ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
Selection Process:
Lower Division Clerk:
ఇంటర్ క్వాలిఫికేషన్తో భర్తీ చేస్తున్న ఈ పోస్టులకి క్రింది విధంగా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది.
Part -1: Screening Test: ఎగ్జామ్ అనేది ఆబ్జెక్టివ్ రూపంలో ఉంటుంది.
జనరల్ నాలెడ్జ్, అర్థమెటిక్ ఎబిలిటీ, లాంగ్వేజ్ (ఇంగ్లీష్/హిందీ), రీజనింగ్ నుండి ప్రశ్నలు రావడం జరుగుతుంది. ఎగ్జామ్ అనేది టోటల్గా 80 మార్కులకు గాను రెండు గంటల పాటు నిర్వహించడం జరుగుతుంది.
ఈ ఎగ్జామ్లో 40 శాతం మార్కులను సంపాదించిన క్యాండిడేట్స్ క్వాలిఫై అవుతారు. ఈ పేపర్ అనేది ఓన్లీ క్వాలిఫై మాత్రమే.
Part -2: Written Test: ఎగ్జామ్ అనేది సబ్జెక్టివ్ రూపంలో ఉంటుంది.
నోటింగ్ & డ్రాప్టింగ్, జనరల్ అవేర్నెస్, ఇండియన్ కల్చర్ (పర్ఫార్మింగ్ ఆర్ట్స్ సచ్ అస్ థియేటర్ హెడ్సెట్రా..) నుండి ప్రశ్నలు రావడం జరుగుతుంది. మొత్తంగా 100 ప్రశ్నలకు గాను 2 గంటల పాటు ఎగ్జామ్ ఉంటుంది. మీకు జాబ్ రావాలి అంటే ఈ పార్ట్ 2 లో మంచి మార్కులు రావాలి.
తర్వాత కంప్యూటర్ స్కిల్ టస్ట్ ను నిర్వహించడం జరుగుతుంది. ఈ టైపింగ్ టెస్ట్ ను 10 మినిట్స్ పాటు నిర్వహించడం జరుగుతుంది. కంప్యూటర్ లో 35 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ లేదా 30 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ హిందీ లో టైపింగ్ చేయాలి.
మిగిలిన పోస్టులు Accounts Officer, Assistant Registrar, Assistant Light and Sound Technician, Assistant Wardrobe Supervisor పోస్టుల సెలక్షన్ ప్రాసెస్ మరియు సిలబస్ ను మీరే అఫీషియల్ నోటిఫికేషన్ సందర్శించి తెలుసుకోండి.
Salary:
లోవర్ డివిజన్ క్లర్క్ - లెవెల్-2 - Rs. 19,900-63,200,
అకౌంట్స్ ఆఫీసర్ - లెవెల్-8 - Rs. 47,600-1,51,100,
అసిస్టెంట్ రిజిస్టర్-లెవెల్-7 - ,Rs. 44,900-1,42,400,
అసిస్టెంట్ లైట్ అండ్ సౌండ్ టెక్నీషియన్ - లెవెల్-6, Rs. 35,400-1,12,400,
అసిస్టెంట్ వార్డ్రోబ్ సూపర్వైజర్ - లెవెల్-6 - Rs. 35,400-1,12,400
Official Website: www.nsd.gov.in
0 కామెంట్‌లు