Nagpur Railway Apprentices Recruitment 2025 in telugu: ITI క్వాలిఫికేషన్ తో రైల్వేలో ఉద్యోగాలు
South East Central Railway, Nagapur నుండి అప్రెంటిసిస్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా 1012 అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఐటిఐ చేసిన అభ్యర్థులందరూ రిక్రూట్మెంట్ కి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మే 4, 2025.
ఈ రైల్వే అప్రెంటిస్ నోఫికేషన్ కోసం ఏప్రిల్ 5, 2025 వ తేదీ నుండి మే 4, 2025 వ తేదీ లోపు www.apprenticeshipindia.gov.in వెబ్సైట్లో ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
ఈ రిక్రూట్మెంట్ కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
ఈ రిక్రూట్మెంట్ ద్వారా నాగపూర్ డివిజన్ లో ఫిట్టర్ లో 66 పోస్టులు, కార్పెంటర్ లో 39 పోస్టులు, వెల్డర్ లో 17 పోస్టులు, COPA లో 170 పోస్టులు, ఎలక్ట్రీషియంలో 253 పోస్టులు, స్టెనోగ్రాఫర్ (ఇంగ్లీషు)/సెక్రటేరియల్ అసిస్టెంట్ లో 20 పోస్టులు, ప్లంబర్ 36 పోస్టులు, పెయింటర్లో 52 పోస్టులు, వైర్మన్లో 42 పోస్టులు, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ లో 12 పోస్టులు, డీజిల్ మెకానిక్ లో 110 పోస్టులు, మెకినిస్టు లో 5 పోస్టులు, టర్నర్ లో ఏడు పోస్తులు, డెంటల్ లాబరేటరీ టెక్నీషియన్ ఒక పోస్టు, హాస్పిటల్ వేస్ట్ మేనేజ్మెంట్ టెక్నీషియన్ ఒక పోస్టు, హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఒక పోస్టు, స్టెనోగ్రాఫర్ (హిందీ) 12 పోస్టులు, కేబుల్ జాయింట్ 21 పోస్టులు, డిజిటల్ ఫోటోగ్రాఫర్ 3 పోస్టులు, డ్రైవర్ కం మెకానిక్ (లైట్ మోటార్ వెహికల్) 3 పోస్టులు, మెకానిక్ మిషిన్ టూల్ మెయింటెనెన్స్ 12 పోస్టులు, మాసమ్ (బిల్డింగ్ కన్స్ట్రక్టర్) 36 పోస్టులు మొత్తంగా 919 పోస్టులను రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు.
మోతిబాగ్ డివిజన్ లో ట్విట్టర్ 44 పోస్టులు, వెల్డర్ 9 పోస్టులు, టర్నర్ 4 పోస్టులు, ఎలక్ట్రీషియన్ 18 పోస్టులు, COPA 13 పోస్టులు మొత్తంగా 88 పోస్టులను భర్తీ చేస్తున్నారు.
Age Limit:
15 సంవత్సరముల నుండి 24 సంవత్సరముల మధ్య వయసు కలిగిన వారు అందరూ ఈ నోటిఫికేషన్ కి అర్హులు.
ఎస్సీ ఎస్టీకి 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సషన్ ఉంది.
ఓబీసీకి 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సషన్ ఉంది.
ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ మరియు ఎక్సెస్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు 10 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
అంటే అన్ రిజర్వుడ్ అభ్యర్థులు ఏప్రిల్ 5, 2001 నుండి ఏప్రిల్ 5, 2010 మధ్య పుట్టిన అభ్యర్థులు రిక్రూట్మెంట్ కి అప్లై చేసుకోవచ్చు.
ఓబీసీ అభ్యర్థులు ఏప్రిల్ 5, 1998 నుండి ఏప్రిల్ 5, 2010 మధ్య పుట్టి ఉంటే రిక్రూట్మెంట్ కి అప్లై చేసుకోవచ్చు.
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులు ఏప్రిల్ 5, 1996 నుండి ఏప్రిల్ 5, 2010 మధ్య పుట్టి ఉంటే ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు.
ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ మరియు ఎక్సెస్ సర్వీస్ మెన్ అభ్యర్థులు ఏప్రిల్ 5, 1991 నుండి ఏప్రిల్ 5, 2010 మధ్య పుట్టి ఉంటే ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు.
Qualification:
పదవ తరగతిలో 50% మార్కులతో పాసై ఐటిఐ కంప్లీట్ చేసిన అభ్యర్థులందరూ ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు.
Selection Process:
పదవ తరగతి మరియు ఐటిఐ లో వచ్చిన మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది.
ఐటిఐ లో రెండు సంవత్సరాలు ట్రేడ్ చేసి అప్రెంటిసిప్ చేస్తే 8050 రూపాయలు సాలరీ వస్తుంది. ఐటిఐ లో ఒక సంవత్సరం ట్రేడ్ చేసి అప్రెంటిషిప్ చేస్తే 7700 శాలరీ వస్తుంది.
మీకు ఏవైనా డౌట్స్ ఉంటే సోమవారం నుండి శుక్రవారం మధ్య ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5:30 లోపు ఈ నంబర్ 8767610437 కి కాల్ చేసి తెలుసుకోగలరు.
0 కామెంట్‌లు