About Me

header ads

Netmaker Recruitment 2025 in telugu: టెన్త్ క్వాలిఫికేషన్ ఉద్యోగాలు

 Netmaker Recruitment 2025 in telugu: టెన్త్ క్వాలిఫికేషన్ ఉద్యోగాలు

Netmaker Recruitment 2025 in telugu: టెన్త్ క్వాలిఫికేషన్ ఉద్యోగాలు


  గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఫిషర్స్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ నాటికల్స్ అండ్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ సంస్థ నుండి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా Netmaker పోస్టును భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాన్ని డైరెక్టర్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నాను. ఈ ఉద్యోగం లెవెల్ - 1 ఉద్యోగం. ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయినట్లయితే 18,000 రూపాయల నుండి 56900 రూపాయల మధ్య సాలరీ ఉంటుంది. ఈ ఉద్యోగం గ్రూప్ సి నాన్ గెజిటెడ్ నాన్ మినిస్ట్రీయల్ ఉద్యోగం. ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయినట్లయితే తమిళనాడు, చెన్నైలో పని చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇండియాలోని ఏ ప్లేస్ లోనైనా పని చేయవచ్చు. ఈ ఉద్యోగాన్ని ముందుగా టెంప రిగా గా తీసుకోవడం జరుగుతుంది. తర్వాత పర్మినెంట్ చేయడం జరుగుతుంది.


ఈ నోటిఫికేషన్ ద్వారా Netmaker ఒక పోస్టును మాత్రమే భర్తీ చేస్తున్నారు. ఆ ఒక్క పోస్టును అన్ రిజర్వుడు కింద భర్తీ చేస్తున్నారు. ఏ కాస్ట్ వారైనా ఈ పోస్టుకి అప్లై చేసుకోవచ్చు. ఒక పోస్టే కదా అని నిర్లక్ష్యం చేసుకోవద్దు. 


  ఈ Netmaker రిక్రూట్మెంట్ కోసం మే 12, 2025 వ తేదీలోపు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి.

  Age Limit: 

  18 నుండి 25 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు ఈ Netmaker పోస్టుకి అప్లై చేసుకోవచ్చు. 


  అండ్ రిజర్వ్ ఢ్ కింద పోస్టును భర్తీ చేస్తున్నారు కాబట్టి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ లేవు.


  ఈ 18 నుండి 25 సంవత్సరాలు అనేది మే 12, 2025 నాటికి ఉండాలి.


Educational Qualification: 


  10 th లో పాసైన అభ్యర్థులందరూ ఈ Netmaker పోస్ట్ కి అప్లై చేసుకోవచ్చు. 
  అలాగే నెట్ మేకింగ్ మరియు నెట్ మెయింటెనెన్స్ మీద ఎక్స్పీరియన్స్ ఉండాలి.

How to apply: 


  ఈ Netmaker పోస్ట్ కి అప్లై చేసుకోవాలి అనుకుంటే, ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. వారు నోటిఫికేషన్ లో ఇచ్చిన అప్లికేషన్ ఫారం ను ప్రింట్ చేయించుకోవాలి. 

  ముందుగా మీరు అప్లికేషన్ ఫారంలో అడ్వర్టైజ్ నెంబర్ వేయండి. 
తర్వాత పోస్ట్ పేరు రాయండి. 
తర్వాత మీ పేరు రాయండి. 
తర్వాత డేట్ ఆఫ్ బర్త్ వేయండి. 
తర్వాత మీ ఫాదర్స్ నేమ్ రాయండి. 
తర్వాత మీ జెండర్ రాయండి. 
తర్వాత మీ కేటగిరి రాయండి. 
తర్వాత మీ నేషనాలిటీ రాయండి. 
తర్వాత మీ ఏజ్ ఎంతనో రాయండి. 
తర్వాత కరస్పాండెంట్స్ అడ్రస్ రాయండి పిన్కోడుతో సహా..
తర్వాత పర్మినెంట్ అడ్రస్ రాయండి పిన్కోడ్ తో సహా.
తర్వాత ఈమెయిల్ ఐడి రాయండి 
తర్వాత ఫోన్ నెంబర్ రాయండి 
తర్వాత మీ యొక్క రిలీజియన్ రాయండి. 
తర్వాత మీ యొక్క క్వాలిఫికేషన్స్ కాపిస్ ను అటాచ్ చేయండి. అలాగే మీ యొక్క క్వాలిఫికేషన్ గురించి నోటిఫికేషన్ నీ ఫిల్ చేయండి.
అలాగే మీ యొక్క ఎక్స్పీరియన్స్ గురించి రాయండి. అలాగే ఎక్స్పీరియన్స్ కాపీని అటాచ్ చేయండి. 

  పైన తెలిపిన అన్ని కాపీస్ ని అటాచ్ చేసి, పాస్పోర్ట్ సైజు ఫోటోను అంటించి గజిటెడ్ సైన్ చేయించి, మే 12, 2025 వ తేదీ లోపు మీరు ది డైరెక్ట్ సెంట్రల్ ఇనిస్ట్యూట్ ఆఫ్ ఫిషరీస్ నాటికల్ అండ్ ఇంజనీరింగ్ ట్రైనింగ్, ఫోర్షరీ రోడ్డు, కొచ్చి - 16 అడ్రస్ కు పంపండి. 

Application Fee: 


  ఈ పోస్టులకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. నోటిఫికేషన్ లో ఎటువంటి అప్లికేషన్ ఫీజుకు సంబంధించి తెలుపడం జరగలేదు.

  మీరు అప్లై చేయకపోయినా, మీ ఫ్రెండ్స్ ఎవరైనా చేపలు పట్టే వారు ఉంటే ఈ నోటిఫికేషన్ వారికి షేర్ చేయండి. వారికి చాలా ఉపయోగపడుతుంది.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు