RRB ALP Recruitment 2025 in telugu: అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి 2025 కు సంబంధించి మొదటి నోటిఫికేషన్ గా ALP(అసిస్టెంట్ లోకో పైలట్) నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా Assistant Loco Pilot (ALP), Level -2 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఈ రైల్వే రిక్రూట్మెంట్ అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ ద్వారా 9970 పోస్టులను భర్తీ చేస్తున్నారు.
ఈ 9970 పోస్టులలో
AHMEDABAD - WR - 497
AJMER - NWR - 679
WCR - 141
PRAYAGRAJ - NR - 80
NCR - 508
BHOPAL - WR - 46
WCR - 618
BHUBANESWAR - ECOR -
928
BILASPUR - SECR - 568
CHANDIGARH - NR - 433
CHENNAI - SR - 362
GORAKHPUR - NER - 100
GUWAHATI - NFR - 30
JAMMU-SRINAGAR - NR - 8
KOLKATA - SER - 262
ER - 458
MALDA - ER - 410
SER - 24
MUMBAI - SCR - 22
CR - 376
WR - 342
MUZAFFARPUR - ECR - 89
PATNA - ECR - 33
RANCHI - ECR - 578
SER - 635
SECUNDERABAD - SCR - 967
ECOR - 533
SILIGURI - NFR - 95
THIRUVANANTHAPURAM - SR - 148 పోస్టులను ఈ రైల్వే రిక్రూట్మెంట్ అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు.
మీరు ఏ జోన్ కి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ జోన్ కి సంబంధించి క్యాటగిరి వైజ్ పోస్టులను చూసుకోండి.
ఈ అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ కోసం ఏప్రిల్ 12, 2025 వ తేదీ నుండి మే 11, 2025 వ తేదీ లోపు మీరు ఏ జోన్ కి అయితే అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ జోన్ కి అప్లై చేసుకోండి.
మీరు ఒక జోనికి మాత్రమే అప్లై చేసుకోవాలి. ఒక అప్లికేషన్ మాత్రమే పెట్టాలి.
అప్లికేషన్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ మే 13, 2025.
అప్లికేషన్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే మే 14, 2025 వ తేదీ నుండి మే 23, 2025 వ తేదీ లోపు కరెక్ట్ చేసుకోవాలి. ( అయితే మీరు చూస్ చేసుకున్న ఆర్ఆర్బీ జోన్ ను మరియు క్రియేట్ ఆన్ అకౌంటు ఫామ్ ను మీరు మోడీపై చేయలేరు.) అందుకే అప్లై చేసుకునే ముందు జాగ్రత్తగా ఇన్స్ట్రక్షన్స్ చదువుకొని, ఎటువంటి తప్పులు లేకుండా అప్లై చేసుకోగలరు.
RRB ALP AGE LIMIT:
ఈ Assistant Loco Pilot (ALP) Notification 2025 కి అప్లై చేయాలి అంటే క్యాండిడేట్స్ 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. (వయసు కట్ ఆఫ్ డేటు జూలై 1, 2025)
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులు కి 5 సంవత్సరముల వయస్సు రిలాక్సియేషన్ ఉంది.
ఓబీసీ అభ్యర్థుల కి 3 సంవత్సరముల వయస్సు రిలాక్సియేషన్ ఉంది.
వీడో, డైవర్సుడు విమెన్ or జుడిసి వెళ్లి సపరేటేడ్ విమెన్ ఫ్రొం హస్బెండ్ బట్ నాట్ రీ మారీడ్ అభ్యర్థులు - అన్ రిజర్వ్డ్/ ఈడబ్ల్యూఎస్ - 35, ఓబీసీ - 38, ఎస్సీ, ఎస్టీ - 40 వరకు అప్లై చేసుకోవచ్చు.
ఎక్స్ సర్వీస్ మెన్, అప్రెంటిస్ చేసిన క్యాండిడేట్స్ కి కూడా రిలాక్సియేషన్ ఉంది. క్యాండిడేట్స్ అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకొని రిక్రూట్మెంట్ కి అప్లై చేసుకోండి.
అంటే అన్ రిజర్వుడ్ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు జులై 02, 1995 - జూలై 01, 2007 తేదీల మధ్య పుట్టి ఉంటే అప్లై చేసుకోవచ్చు.
ఓబిసి (నాన్ క్రీమీలెయర్) అభ్యర్థులు జులై 02, 1992 - జులై 01, 2007 మధ్య పుట్టి ఉంటే రిక్రూట్మెంట్ కి అప్లై చేసుకోవచ్చు.
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులు జులై 02, 1990 - జూలై 01 2007 మధ్య పుట్టి ఉంటే ఈ అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు.
RRB ALP Educational Qualification:
పదవ తరగతి/ Fitter, Electrician, Instrument
Mechanic, Millwright/Maintenance
Mechanic, Mechanic (Radio & TV),
Electronics Mechanic, Mechanic (Motor
Vehicle), Wireman, Tractor Mechanic,
Armature & Coil Winder, Mechanic (Diesel),
Heat Engine, Turner, Machinist,
Refrigeration & Air- Conditioning Mechanic ట్రేడ్స్ లో ఐటిఐ కంప్లీట్ చేసి ఉంటే ఈ అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు.
లేదా
పైన తెలిపిన ట్రేడ్స్ లో అప్రెంటిషిప్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు.
లేదా
Mechanical / Electrical /
Electronics / Automobile Engineering విభాగాలలో 3 సంవత్సరాల డిప్లమా కంప్లీట్ చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు. రిలవెంట్ ట్రేడ్స్ లో డిగ్రీ లేదా బీటెక్ చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు.
Selection Process For RRB ALP:
ఈ రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ 2025 ను 5 స్టేజీల్లో భర్తీ చేస్తున్నారు.
1) CBT - 1
2) CBT - 2
3) కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్(CBAT)
4) డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV)
5) మెడికల్ ఎగ్జామినేషన్ (ME)
1) CBT - 1 (COMPUTER BASED TEST)
ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది 75 ప్రశ్నలకు గాను ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు లగా 75 మార్కుల చొప్పున 60 నిమిషాల పాటు ఈ ఎగ్జామ్ ను నిర్వహించడం జరుగుతుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3rd నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఎగ్జామ్ ను మల్టిపుల్ షిప్ట్ లలో అభ్యర్థులకు నిర్వహించడం జరుగుతుంది. ఒక షిప్ట్ లో పేపర్ ఈజీగా రావచ్చు, మరొక షిఫ్ట్ లో పేపర్ కష్టంగా ఉండవచ్చు. కాబట్టి అన్ని షిప్ట్ లను కలుపుకొని నార్మలైజ్ చేయడం జరుగుతుంది.
ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కు ప్రశ్నలు వచ్చేసి మ్యాథమెటిక్స్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ నుండి రావడం జరుగుతుంది. కంప్లీట్ సిలబస్ కోసం ఫుల్ నోటిఫికేషన్ చదువుకొని తెలుసుకోండి.
జనరల్ మరియు ఈ డబ్ల్యూఎస్ అభ్యర్థులు-40%, ఓబిసి-30%, ఎస్సీ-30%, ఎస్టీ-25% మార్కులను సాధించగలిగితేనే వారు పోటీలో నిలుస్తారు. అలా అని ఇవి పాస్ మార్కులు కాదు.
2) CBT - 1 (COMPUTER BASED TEST):
అభ్యర్థులు అప్లై చేసుకున్న ఆర్ఆర్బీ లో కమ్యూనిటీ వైస్ సిబిటి-1 లో సాధించిన మార్కల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి సిబిటి-2 కు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ సిబిటి-2 కు 1:15 రేషియోలో అభ్యర్థులను సెలెక్ట్ చేయడం జరుగుతుంది.
ఈ సిబిటి 2 ఎగ్జామ్ రెండు పార్టు లలో ఉంటుంది. పార్ట్ - ఎ మరియు పార్ట్ - బి.
ఈ పేపర్ అనేది 175 క్వశ్చన్స్ కు గాను రెండు గంటల 30 నిమిషాల పాటు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3rd నెగెటివ్ మార్కింగ్ ఉంది.
Part- A: 90 నిమిషాలు - 100 ప్రశ్నలు
Part- B: 60 నిమిషాలు - 75 ప్రశ్నలు
పార్ట్ - బి అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ మాత్రమే. పార్ట్ - బి లో 35% మార్కులు వస్తే మీరు క్వాలిఫై అయినట్టే. మీకు జాబు రావాలి అంటే పార్ట్ - ఏ లో మంచి మార్కులు సంపాదించాలి.
సిలబస్ కు సంబంధించి మీరే చూసుకోండి.
3) Computer Based Aptitude Test (CBAT):
సిబిటి - 2 నుండి ఈ కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ కు 1:8 రేషియోలో సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సిబిటి - 2 లో పార్ట్ - ఏ నుండి అభ్యర్థులను షార్టు లిస్టు చేయడం జరుగుతుంది. ఈ CBAT అనేది ఇంగ్లీష్ మరియు హిందీలో ఉంటుంది. ఎటువంటి నెగటివ్ మార్కింగ్ లేదు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
5) మెడికల్ ఎగ్జామినేషన్ (ME):
ఈ అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకి A -1 మెడికల్ స్టాండర్డ్ ఉన్న అభ్యర్థులు మాత్రమే అర్హులు. A -1 మెడికల్ స్టాండర్డ్ వివరాలను అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.
Examination Fee For RRB ALP:
ఈ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 500 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.
సిబిటి-1 రాసిన తర్వాత 400 రూపాయలు మీ బ్యాంకులో రిఫండ్ కావడం జరుగుతుంది.
మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ట్రాన్స్ జెండర్, మైనారిటీస్, ఎకనామికల్లి బ్యాక్వర్డ్ క్లాసెస్(EBC) అభ్యర్థులు 250 లను అప్లికేషన్ ఫీజు కింద చెల్లిస్తే సరిపోతుంది.
సిబిటీ - 1 రాసిన తర్వాత వీరికి 250 రూపాయలు రిఫండ్ కావడం జరుగుతుంది.
అభ్యర్థులు తమ బ్యాంకు డీటెయిల్స్ లను తప్పులు లేకుండా ఇవ్వండి. రిఫండ్ డబ్బులకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు.
ఇక్కడ ఎకనామికల్లి బ్యాక్వర్డ్ క్లాసెస్(OBC) మరియు ఎకనామికల్లి వీకర్ సెక్షన్స్(EWS) ఈ రెండు వేరు వేరు. OBC మరియు EWS రెండింటి మధ్య తేడాను చూసుకోండి.
How to apply for RRB ALP:
*అభ్యర్థులు ఒకటికి రెండుసార్లు నోటిఫికేషన్ బాగా చదివి అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే ఆన్లైన్లో అప్లై చేసుకోండి.
*అభ్యర్థులు తాము అప్లై చేసుకోవాలి అనుకున్న ఆర్ఆర్బి జోన్ ను సెలెక్ట్ చేసుకోండి. ఏదైనా ఒక ఆర్ఆర్బి జోన్ కు మాత్రమే అప్లై చేసుకోవాలి. ప్రతి అభ్యర్థి ఒక అప్లికేషన్ మాత్రమే పెట్టాలి.
*ముందుగా అభ్యర్థులు క్రియేట్ అకౌంటును క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ అకౌంట్ ముందుగా ఉన్నట్లయితే అభ్యర్థులు లాగిన్ అవ్వాలి.
*ఈ క్రియేట్ ఆన్ అకౌంట్లో 12 డీటెయిల్స్ ను నింపాలి. మొబైల్ నెంబర్ మరియు ఈమెయిల్ ఐడి, అభ్యర్థి పేరు, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, జెండర్, నేషనాలిటీ, డేట్ అఫ్ బర్త్, మెట్రిక్యులేషన్ రోల్ నెంబర్ & మెట్రిక్యులేషన్ సర్టిఫికెట్ సీరియల్ నెంబర్, మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్ డేట్ & ఈ కేవైసీ ఫిల్ చేయాలి. క్రియేట్ అకౌంటును జాగ్రత్తగా చేసుకోండి. మీరు అప్లై చేసుకున్నాక ఎడిట్ ఆప్షన్ చేసుకోవడానికి క్రియేట్ అన్ అకౌంటు ఎడిట్ కాదు.
*క్రియేట్ అన్ అకౌంట్ చేసుకున్న తర్వాత ఆర్ఆర్బి జోన్ ను సెలెక్ట్ చేసుకోవాలి.
* మీరు అప్లై చేసుకునే ముందు ఈ క్రింది డాక్యుమెంట్లని రెడీ చేసి పెట్టుకోండి.
1) పాస్పోర్ట్ సైజు ఫోటో: వైట్ బ్యాక్ గ్రౌండ్ లో దిగి ఉండాలి. అభ్యర్థి యొక్క డ్రెస్ వైట్ కలర్ లో ఉండకూడదు, డార్క్ కలర్ లో ఉండాలి. మీరు వాడే ఫోటో రెండు నెలల లోపు దిగి ఉన్నది అయ్యి ఉండాలి. 35 ఎంఎం విడ్త్ మరియు 45 ఎంఎం హైటు ఉండాలి. ఫోటో అనేది 50-150 కెబి మధ్యలో ఉండాలి. సన్ గ్లాసెస్/డార్క్ గ్లాస్సెస్/కాపు మరియు హాట్ పెట్టుకొని ఫోటో దిగకూడదు.
2) సిగ్నేచర్: సిగ్నేచర్ను అభ్యర్థులు వైట్ పేపర్ లో బ్లాక్ ఇంక్ పెన్ తో సైన్ చేయాలి. మీరు సైన్ ఎలా చేస్తారో అలా నే చేయాలి. బ్లాక్ లెటర్స్/క్యాపిటల్ లెటర్స్/ డిజైన్ లెటర్స్ తో సైన్ చేయకూడదు. ఇమేజ్ అనేది జేపీజీ లేదా జెపిఈజీ ఫార్మాట్లో ఉండాలి. అలాగే సైజ్ అనేది 30 నుండి 49 కెబి మధ్యలో ఉండాలి. మీరు అప్లోడ్ చేసే సిగ్నేచర్ మినిమం 140 పిక్సల్స్ విడ్త్ మరియు 60 పిక్సెల్స్ హైట్ ఉండాలి. లేదంటే 35 ఎంఎం విడ్త్ మరియు 20 ఎంఎం హైటు ఉండాలి.
3) ఎస్సీ, ఎస్టీ సర్టిఫికెట్: ఫ్రీ ట్రైన్ ట్రావెల్ పాస్ కావాలి అనుకుంటే ఈ ఎస్సీ ఎస్టీ సర్టిఫికెట్ను అప్లోడ్ చేయాలి. మీరు స్కాన్ చేసుకున్న డాక్యుమెంట్ అనేది పిడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి. అలాగే పిడిఎఫ్ సైజ్ అనేది 400 కేబి లోపల ఉండాలి. లేటెస్ట్ సర్టిఫికెట్ అయి ఉండాలి. క్లియర్గా స్కాన్ చేసుకోవాలి.
అభ్యర్థులు ఏ తప్పులు లేకుండా అప్లై చేసుకోండి. అప్లికేషన్ ఫీజు చెల్లించి, మీ అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకోండి.
Imp links:
Ahmedabad: www.rrbahmedabad.gov.in
Ajmer: www.rrbajmer.gov.in
Bhopal: www.rrbbhopal.gov.in
Bhubaneswar: www.rrbbbs.gov.in
Bilaspur: www.rrbbilaspur.gov.in
Chandigarh: www.rrbcdg.gov.in
Chennai: www.rrbchennai.gov.in
Gorakhpur: www.rrbgkp.gov.in
Guwahati: www.rrbguwahati.gov.in
Jammu-Srinagar: www.rrbjammu.nic.in
Kolkata: www.rrbkolkata.gov.in
Malda: www.rrbmalda.gov.in
Mumbai: www.rrbmumbai.gov.in
Muzaffarpur: www.rrbmuzaffarpur.gov.in
Patna: www.rrbpatna.gov.in
Prayagraj: www.rrbald.gov.in
Ranchi: www.rrbranchi.gov.in
Secunderabad: www.rrbsecunderabad.gov.in
Siliguri: www.rrbsiliguri.gov.in
Thiruvananthapuram: www.rrbthiruvananthapuram.gov.in
0 కామెంట్‌లు